వెబ్ సిరీస్ దర్శకుడితో నితిన్.. గేమ్ ఆన్ ట్రైలర్ రిలీజ్..

TV9 Telugu

31 January 2024

ఇటీవల వచ్చిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆదిత్య హాసన్.

ఈయనకు ఇప్పుడు అవకాశాలు వరసగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే నితిన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.

త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రాబిన్ హుడ్‌తో బిజీగా ఉన్నారు నితిన్.

ఇదిలా ఉండే 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‌ సీజన్ 2 కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.

గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వం వహిస్తున్న తెలుగు సైకలాజికల్ యాక్షన్ డ్రామా సినిమా గేమ్ ఆన్.

ఈ చిత్రంలో అలంటి హిందీ, తెలుగు హీరోయిన్ మధుబాల, ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ ఇందులో కీలక పాత్రల్లో పోషించారు.

ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది గేమ్ ఆన్. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్‌గా గేమ్ ఆన్ సినిమాను తెరకెక్కించారు.

తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ట్రైలర్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు.