TV9 Telugu

07 January 2024

ఓటీటీలోకి ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్. ఎప్పుడు, ఎక్కడంటే.?

టాలీవుడ్ హీరో నితిన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరి మ్యాన్’.

రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 8న అడియన్స్ ముందుకు వచ్చింది.

విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో ఓ రేంజ్ అంచనాలను పెంచేసిన ఈ సినిమా..

కానీ అస్సలు ఊహించని స్థాయిలో ప్రేక్షకులను నిరాశ పరిచింది.

కానీ అనూహ్యంగా ఓటీటీ ఫీల్డ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ సినిమా.. తాజాగా స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను జనవరి 13న స్ట్రీమింగ్ చేయనున్నారని ప్రచారం నడుస్తోంది.

త్వరలోనే అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. చూడాలి మరీ సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందా ? లేదా ? అని.