21 December 2023

ఓటీటీలోకి నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్

నితిన్‌ హీరోగా వచ్చిన కొత్త సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. డిసెంబర్ 8వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

సీనియర్‌ హీరో రాజశేఖర్ కూడా ఈ సినిమాలో క్యామియో అప్పియరెన్స్‌ ఇచ్చారు.

సినిమా రిలీజ్‌కు ముందు విడుదలైన పాటలు, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచాయి.

అయితే విడుదల తర్వాత మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది ఈ సినిమా.

కానీ ఓటీటీ వేదికగా ఈ సినిమా వస్తే .,.. చూడాలనే కోరిక మాత్రం అందర్లో ఉంది. 

అకార్డింగ్‌ టూ ఫిల్మ్ రిపోర్ట్‌ ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్‌ కానున్నట్లు ఇండస్ట్రీలో టాక్.