షఫిల్‌ చేసేయండి వాళ్లని!

TV9 Telugu

24 March 2024

లాస్ట్ నవంబర్‌ నుంచి ఒక్క గోల్‌ కూడా కొట్టకపోవడమేంటి? అని అసహనంగా ఉన్నారు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.

ఇంతకీ హీరో నిఖిల్‌కీ, గోల్‌కీ సంబంధం ఏంటని అంటున్నారా? యంగ్ హీరో నిఖిల్‌కి ఫుట్‌బాల్‌ ఆడటం చాలా ఇష్టం.

అందుకే ఆయన తీరిక దొరికినప్పుడల్లా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తుంటారు. లేటెస్ట్ గా ఆయ ఫిఫా వరల్డ్ కప్‌ చూశారు.

ఆ కప్‌ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో మన వాళ్ల ఆటతీరు నిఖిల్‌ని డిసప్పాయింట్‌ చేసింది. అందుకే దీని మీద స్పందించారు కార్తికేయ స్టార్‌.

ఇండియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ గురించి మాట్లాడారు. ఆటతీరు కచ్చితంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు.

మన దేశం ఎంతో సాధించాలని, జట్టుని షఫిల్‌ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. అంతే కాదు, ఆఫ్గనిస్తాన్‌ని ఓడించలేకపోయినందుకు నిఖిల్‌ బాధ వర్ణనాతీతం.

మామూలుగా స్టార్లు క్రికెట్‌ గురించి మాట్లాడుతుంటారు. కానీ నిఖిల్‌ ఇలా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ గురించి, ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ గురించి మాట్లాడుతున్నారు.

ఈ టాపిక్‌ ఇమీడియేట్‌గా వైరల్‌ అయింది. అన్నట్టు ప్రస్తుతం స్వయంభు సినిమాతో బిజీగా ఉన్నారు నిఖిల్‌ సిద్ధార్థ్‌.