నాకు ఆ హీరోనే కావాలంటున్న మెగా డాటర్
Phani CH
02 AUG 2024
నిహారిక గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు.. మెగా ఫ్యామిలీలో రెబల్ డాటర్ ని చెప్పొచ్చు.
ఈ చిన్నది మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం.. ఇలా కొన్ని చిత్రాలు చేసినా అవేమీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
2020లో వెంకట చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు అరేంజ్డ్ మ్యారేజ్ అవ్వగా ఆ తరువాత మనస్పర్థలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు.
అయితే తాజాగా కమిటీ కుర్రాళ్ళు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నిహారికను మీకు ఇష్టమైన హీరో ఎవరని యాంకర్ అడిగారు.
యాంకర్ మూడు ఆప్షన్స్ ఇచ్చింది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లలో ఎవరితో నటించాలని అనుకుంటున్నారని యాంకర్ అడిగారు.
నేను ప్రభాస్ తో నటించాలని అనుకుంటున్నాను. ప్రభాస్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. డార్లింగ్ మూవీ చాలా బాగుంటుంది.
అలాగే మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలన్నా కూడా చాలా ఇష్టం. ఒకవేళ అలాంటి సినిమా ఆయనతో చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను అని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి