TV9 Telugu
ప్రేమపై నిహారిక ఆసక్తికర పోస్ట్.. ఏమై ఉంటుందబ్బా?
23 Febraury 2024
విడాకుల తర్వాత మళ్లీ ప్రొఫెషనల్ కెరీర్ పై దృష్టి సారించింది మెగా డాటర్ నిహారిక. సినిమాలతో బిజీగా మారిపోయింది.
సినిమాలతో పాటు గతంలో తనకు క్రేజ్ తీసుకొచ్చిన వెబ్ సిరీస్ ల నిర్మాణంపైనా దృష్టి సారించిందీ అందాల తార.
అలాగే రాక్ స్టార్ మంచు మనోజ్ నటిస్తోన్న వాట్ ది ఫిష్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది మెగా డాటర్ నిహారిక
విడాకుల తర్వాత ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది నిహారిక. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను షేర్ చేస్తోంది.
అయితే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
'నీకు కావాల్సింది లవ్, బీచ్ మాత్రమే' అని ఉన్న ఫొటోని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది మెగా డాటర్.
దీంతో నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా? ఏమైనా హింట్ లాంటిది ఇస్తుందా? అని ససోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అయితే నిహారిక కేవలం తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పొందే ప్రేమని ఉద్దేశించి ఈ పోస్ట్ షేర్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..