TV9 Telugu
కష్ట సమయంలో వారే నాకు అండగా నిలిచారు: నిహారిక
26 Febraury 2024
విడాకుల వ్యవహారం తర్వాత మళ్లీ ప్రొఫెషనల్ కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించింది మెగా డాటర్ నిహారిక కొణిదెల.
ప్రస్తుతం టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న వాట్ ది ఫిష్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోందీ అందాల తార.
దీంతో పాటు నిర్మాతగానూ సత్తాచాటేందుకు సిద్ధమైంది. కొత్త వాళ్లతో సినిమాలు, వెబ్ సిరీస్ ల నిర్మాణానికి పచ్చ జెండా ఊపుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా 'సాగు' ఓ షార్ట్ ఫిల్మ్‌కు నిర్మాతగా వ్యవహరించింది మెగా డాటర్ నిహారిక కొణిదెల.
తాజాగా ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కోసం చిత్రయూనిట్ సభ్యులతోపాటు.. నిహారిక కొణిదెల కూడా హాజరైంది.
ఈ సందర్భంగా మాట్లాడిన నిహా ఎమోషనలైంది. వితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయని పరోక్షంగా విడాకుల గురించి చెప్పుకొచ్చింది.
తనకు కష్టం వచ్చిన ప్రతిసారీ తన కుటుంబ సభ్యులే అండగా నిలబడ్డారని, ఆకారణంగానే తాను ముందడుగు వేశానంది నిహారిక
మెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ, టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్, తదితరవాటిల్లో మార్చి 4 నుంచి సాగు స్ట్రీమింగ్ కానుంది
ఇక్కడ క్లిక్ చేయండి..