నిహారిక కొణిదెల మొదటి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Phani CH

28 AUG 2024

మెగా డాటర్ నిహారికకు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిహారిక నిర్మాతగా కూడా విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నిహారిక పడిన కష్టం అంతాఇంతా కాదు.

అయితే నిహారిక ఫస్ట్ శాలరీ ఎంత ఉంటుందనే ప్రశ్నకు ఎవరైనా లక్షల్లో ఉంటుందని ఫీలవుతారనే సంగతి తెలిసిందే.

సినిమాల్లోకి రాకముందు హైదరాబాద్ లోని ఒక కేఫ్ లో పని చేశానని ఆమె ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఆ సమయంలో వారానికి 1000 రూపాయలు జీతంగా తీసుకున్నానని నిహారిక పేర్కొన్నారు. నా చదువంతా హైదరాబాద్ లోనే జరిగింది.

చదువు పూర్తైందని విదేశాలకు వెళ్లి చదువుకోవాలని భావించినా వెళ్లలేదని ఆమె చెప్పుకొచ్చారు. ఇంట్లో నన్ను ఎక్కడికీ పంపించేవారు కాదని నిహారిక చెప్పుకొచ్చారు.

నిహారిక నటిగా కూడా కెరీర్ పరంగా బిజీగా ఉన్నారని త్వరలో మరి కొన్ని కీలక అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.