22 January 2025
ప్రభాస్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న అటామ్ బాంబ్..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో ఆఫర్స్ వచ్చినా అదృష్టం కలిసిరాని హీరోయిన్. ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి.
బెంగుళూరుకు చెందిన ఈ అమ్మడు హైదరాబాద్లోనే పెరిగింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.
అయితే తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం సరైన బ్రేక్ రావట్లేదు. చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి
ఇప్పుడు ఈ అమ్మడు పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ నిధి అగర్వాల్.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది.. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీ ప్లాప్ అయ్యింది.
ఆ తర్వాత మిస్టర్ మజ్ను మూవీతో అలరించింది. కానీ ఈ బ్యూటీ నటించిన రెండు చిత్రాలు డిజాస్టర్ కావడంతో అంతగా గుర్తింపు రాలేదు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.
అలాగే ప్రభాస్ సరసన రాజా సాబ్ మూవీలో నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రంపైనే భారీ ఈ బ్యూటీ ఆశలు పెట్టుకుంది. త్వరలోనే రిలీజ్ కానుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్