24 July 2025
ఐదేళ్లు వెయిటింగ్.. ఎట్టకేలకు హిట్టుకొట్టిన ముద్దుగుమ్మ..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒక్క సినిమా కోసం ఐదేళ్లు వెయిట్ చేసింది. ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ అన్నింటిని వదిలేసి ఒక సినిమా కోసం ఎదురుచూసింది.
ఇక ఇప్పుడు ఎట్టకేలకు హిట్టుకొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఐదేళ్ల నిరీక్షణకు తగిన ఫలితం సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?
ఈ హీరోయిన్ మరెవరో కాదు.. నిధి అగర్వాల్. తాజాగా హరిహర వీరమల్లు సినిమాతో చాలా కాలం తర్వాత అడియన్స్ ముందుకు వచ్చింది ఈ బ్యూటీ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటింటిన ఈ సినిమా జూలై 24న గ్రాండ్ గా అడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో కొల్లగొట్టినాదిలో అంటూ కుర్రాళ్ల గుండెల్ని నిజంగానే కొల్లగొట్టేసింది నిధి. ఈ సినిమాలో తన పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
మరోవైపు సోషల్ మీడియాలో అటు ట్రెడిషనల్ లుక్లో గ్లామర్ టచ్ ఇస్తూనే కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.
తాజాగా నిధి షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇక హరిహర వీరమల్లు ప్రమోషన్స్ కోసం ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో కష్టపడింది.
ఐదేళ్లల్లో ఒక్క సినిమా కూడా పట్టించుకోకుండా హరిహర వీరమల్లు కోసం కష్టపడింది. ఇప్పుడు రాజాసాబ్ చిత్రంలోనూ ఈ బ్యూటీ నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్