మిరాయ్ సినిమాలో నిధి అగర్వాల్ స్పెషల్ సాంగ్.. కానీ అందుకే తీసేసారట..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది మిరాయ్ చిత్రం. ఇందులో కథానాయికగా నటించిన రితిక నాయక్ ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది.
అయితే ఈ చిత్రంలో నిధి అగర్వాల్ సైతం స్పెషల్ సాంగ్ చేసిందట. కానీ థియేటర్లలో మాత్రం ఆమెకు సంబంధించిన సాంగ్ కనిపించడం లేదు. ఆమె పాటను తీసేసారట.
కెరీర్ లో మొదటిసారి మిరాయ్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. గ్లామర్ లుక్కులో ఆ పాటకు స్టెప్పులేసిందట. కానీ సినిమా నిడివి పెరగడం.. కథలో ఇరికించినట్లుగా ఉంటుందని తీసేసారట.
ఇప్పటివరకు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న నిధికి ఇది బ్యాడ్ టైమ్ అనే చెప్పాలి. ఇప్పటివరకు వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఈ అమ్మడు మాత్రం సరైన బ్రేక్ అందుకోలేకపోయింది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఆశలు మొత్తం రాజాసాబ్ చిత్రంపైనే ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో కథానాయికగా నటిస్తుంది.
ఇప్పటికే మిరాయ్ చిత్రంలో వైబ్ ఉంది సాంగ్ తీసేశారు. కానీ సినిమా విడుదలకు ముందే ఈ పాటను రిలీజ్ చేయగా మంచి హిట్టైంది. ఇప్పుడు నిధి పాటను సైతం తొలగించారు మేకర్స్.
ప్రస్తుతం నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ట్రెడిషనల్, గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది. అలాగే వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీగా ఉంటుంది.
ఇప్పుడు ఈ అమ్మడు రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ఇప్పటివరకు నిధి వరుస ప్లాపులు ఖాతాలో వేసుకుంటున్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు మాత్రం తగ్గడం లేదు.