'సీజ్ ది షిప్'.. పవన్‌పై టాలీవుడ్ హీరోయిన్ పోస్ట్ వైరల్

01 December 2024

Basha Shek

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజి బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే.

తాజాగా  పవన్.. బియ్యం అక్రమ రవాణాని అడ్డుకుని ‘సీజ్ ది షిప్’ అని అన్న డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.

ప్రస్తుతం ఈ ట్రేడ్ మార్క్ డైలాగ్ తో సోషల్ మీడియా ఊగిపోతోంది. తాజాగా ఈ డైలాగ్ తో నిధి అగర్వాల్ ఒక పోస్ట్ పెట్టింది.

పవన్ కల్యాణ్ నటిస్తోన్న  హరిహర వీరమల్లు సినిమా లో నిధి అగర్వాల్ ప్రధాన కథానాయికగా నటిస్తోంది

ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా నుండి పవన్ లేటెస్ట్ లుక్ ఒకటి షేర్ చేస్తూ  ‘సీజ్ ది షిప్’ డైలాగ్ ను జత చేసింది.

దీంతో కొద్ది క్షణాల్లోనే నిధి అగర్వాల్ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా మారింది.

కాగా త్వరలోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పవన్ కల్యాణ్ జాయిన్ కానున్నారు. నిధి కూడా షూటింగ్ కు రానుంది.

దీంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమాలో నూ హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్.