కళ్లతోనే కుర్రాళ్లను మత్తులోకి దించుతున్న నిధి..

16 November 2023

17 ఆగస్టు 1993న ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ (ఇప్పుడు తెలంగాణ)లో జన్మించింది వయ్యారి భామ నిధి అగర్వాల్.

హిందీ మాట్లాడే మార్వాడీ కుటుంబంలో పుట్టిన ఈ బ్యూటీ కర్ణాటక రాజధాని బెంగుళూరులో పెరిగింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడగలదు.

దేబీపూర్ మిలన్ విద్యాపీఠ్‌లో పాఠశాల విద్య పూర్తిచేసింది. బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.

చదువుతున్న సమయంలోనే బ్యాలెట్, కథక్ మరియు బెల్లీ డ్యాన్స్‌లో బాగా శిక్షణ పొందింది అందాల తార నిధి అగర్వాల్.

2017లో మున్నా మైఖేల్ అనే ఓ హిందీ యాక్షన్ డ్రామా చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ ముద్దగుమ్మ.

2018లో నాగ చైతన్యకి జోడిగా సవ్యసాచి చిత్రంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ చిత్రంలో తన అందంతో ఆకట్టుకుంది.

2019లో అఖిల్ కి జంటగా మిస్టర్ మజ్ను, రామ్ పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ మూవీలో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

2022లో మహేష్ బాబు మేనల్లుడుతో హీరో మూవీలో నటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీర మల్లు చిత్రంలో నటిస్తుంది.