'  నిద్రలేని రాత్రులు గడుపుతున్నా': నిధి అగర్వాల్

17 January 2025

Basha Shek

అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అదృష్టం కలిసిరాని హీరోయిన్లలో యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరు.

ఇస్మార్ట్ శంకర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది

అయితేప్రస్తుతం ప్రభాస్ ‘ది రాజాసాబ్’  , ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1-స్వార్డ్ vs స్పిరిట్’ చిత్రాలతో బిజిగా ఉంటోంది.

ఈ రెండు చిత్రాల రిలీజ్ తర్వాత తన కెరీర్ మంచి మలుపు తిరుగుతుందని గట్టిగా భావిస్తోంది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్.

అందుకే ప్రభాస్  ది రాజాసాబ్, పవన్ హరిహర వీరమల్లు’ చిత్రాల కోసం ఈ అందాల తార  చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది

ఈ రెండు సినిమాల షూటింగ్‌లో ఒకేసారి పాల్గొంటున్న నిధి అగర్వాల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘గత రెండు నెలలుగా నేను నాన్ స్టాప్‌ గా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. దానికి గ్రేట్ ఫుల్‌ గా ఫీల్ అవుతున్నాను'

 'ఎంత నిద్రపోయినా   కార్లోనే. గత 10 రోజులుగా సరిగా నిద్ర లేకుండా, ఒంటికి రెస్ట్ లేకుండా షూటింగ్స్ చేశాను’ అంటోంది నిధి