22 August 2024

గ్యాప్ ఇస్తే ఇచ్చింది కానీ.. ఇద్దరు బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ అందుకుంది

Rajeev 

Pic credit - Instagram

2014లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొంది అందాల భామ నిధి అగర్వాల్. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. 

హిందీలో మున్నా మైఖేల్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హాట్ బ్యూటీ. 

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిధికి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో నటించింది.

అక్కినేని అఖిల్ సరసన మజ్ను సినిమాలో మెరిసింది. ఈ మూవీ కూడా నిధికి నిరాశే మిగిల్చింది.

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారింది ఈ సినిమాలో అందాలతో ఆకట్టుకుంది. 

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ప్రభాస్ తో ది రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ.