స్పిరిట్‌పై వార్త హల్‌చల్‌.. ఫిట్‌నెస్‌పై షారుఖ్‌ కామెంట్స్.. 

30 December 2023

TV9 Telugu

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటించే స్పిరిట్‌ గురించి తాజాగా ఓ విషయం హల్‌చల్‌ చేస్తోంది.

ఈ చిత్రంపై అభిమానులకు అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా కనిపిస్తారట.

సందీప్‌ రెడ్డి చిత్రాల్లో హీరో కేరక్టరైజేషన్‌ ఎలా ఉంటుందో, స్పిరిట్‌లోనూ అచ్చం అలాగే ఉంటుందని అన్నారు నిర్మాత ప్రణయ్‌.

ఈ సినిమా చిత్రీకరణ 2024 సెప్టెంబర్ లో మొదలుకానుంది. ఈ విషయాన్ని సందీప్ వంగ స్వయంగా యానిమల్ ప్రమోషన్స్ లో తెలిపారు.

ఫిట్‌నెస్‌ అనేది మన ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందని తాజాగా అన్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్.

అంతేకాక తానును ప్రేమించే వారు తన చుట్టూ ఉండటంతో తానెప్పుడూ ఆనందంగా ఉంటానని తెలిపారు బాలీవుడ్ కింగ్ ఖాన్.

ఎప్పుడు పాజిటివ్‌ థింకింగ్‌, చిన్న చిన్న ఆనందాలు తనను ఎప్పుడు ఫిట్‌గా ఉంచుతాయని చెప్పారు బాలీవుడ్ బాద్షా.

ఈ ఏడాది పఠాన్, జవాన్ చిత్రాలతో 1000 కోట్లు కొల్లగొట్టారు. ఇటీవల విడుదలైన డంకి చిత్రం మాత్రం నిరాశపరిచింది.