ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం సలార్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్‌గా తెరకెక్కిన చిత్రమిది.
ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కావాల్సి వుండగా వీఎఫ్ఎక్స్ పనులు పెండింగ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ మూవీ విడుదలపై ఓ వార్త సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తోంది. సినీ ప్రముఖుల ట్వీట్స్ తో ఈ వార్త బలంగా వినిపిస్తోంది.
సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానున్నట్లు ఓ సినీ విశ్లేషకుడు పోస్ట్ పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
అయితే తాజాగా ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితారెడ్డి నీల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన పోస్ట్ తో ఈ వార్తకి మరింత బలం తోడైంది.
లారెన్స్, కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో సీనియర్ దర్శకుడు పి వాసు తెరకెక్కిస్తున్న సినిమా ‘చంద్రముఖి 2’.సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం.
అయితే సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ విడుదల తేదీకి సంబంధించి ఎలాంటి అధికారిగా ప్రకటన ఇవ్వలేదు మూవీ యూనిట్.
ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కనిపించనుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా మెప్పించనున్నారు.