నానికి జోడీగా శ్రద్ధా కపూర్‌.. 

Battula Prudvi

18 October 2024

2023లో దసరా, హాయ్ నాన్న; ఈ ఏడాది సరిపోదా శనివారం సినిమాలతో హిట్ట్రిక్ విజయాలను అందుకున్నారు నాచురల్ స్టార్ నాని.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం హిట్ 3లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన హంటర్స్ కమాండ్ వీడియో ఆకట్టుకుంది.

సుజీత్ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాని డివీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.

దీంతో పాటు దసరాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్‌ ఓదెల దర్సకత్వంలో మరో సినిమాకి సైన్ చేసారు నాచురల్ స్టార్.

నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న రెండో సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో నానికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

ఇది నిజమైతే శ్రద్ధాకి ఇది తెలుగులో రెండో సినిమా అవుతుంది. గతంలో ప్రభాస్ సరసన సాహూతో తెలుగు తెరకు పరిచయం అయింది.

ఇటీవల స్త్రీ 2తో బాలీవుడ్ మరింత పేరు తెచ్చిన శ్రద్ధ కపూర్ ఇందులో ఎంపికైతే హిందీ మంచి వసూళ్లు చేయడం పక్క.