కృతి శెట్టిని ఓ హీరో కుమారుడు వేధిస్తున్నాడట.. నెట్టింట వార్త వైరల్..
ఉప్పెన చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్యూటీ కృతి శెట్టి.
మొదటి చిత్రంతోనే తెలుగు కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టింది ఈ అందాల తార.
తర్వాత వరుసగా టాలీవుడ్‌లో సినిమా ఛాన్స్‌లు కొట్టేసింది.
శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం చిత్రాలతో ఆకట్టుకుంది.
ఇటీవల నాగచైతన్యకి జోడిగా కస్టడీ చిత్రంలో కనిపించింది.
ఇదిలా ఉంటె తాజాగా కృతి శెట్టి వేధింపులకు గురైనట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కెర్లు కొడుతుంది.
ఓ హీరో కుమారుడు కృతికి ఫోన్ చేసి తనతో ఫ్రెండ్‌షిప్ చేయాలని వేధిస్తున్నాడని తెలుస్తోంది.
తన బర్త్ డే పార్టీకి వస్తే డబ్బులు ఎంత కావాలన్నా ఇస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఈ విషయంపై కృతి నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి