నితిష్ తివారి రామాయణంపై మరోసారి చర్చ.. హనుమంతుని పాత్రలో ఆ మాస్ హీరో..

29 October 2023

రాముడిగా రణబీర్ నటించటం పక్కాగా అన్న ప్రచారం జరుగుతున్నా చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

సౌత్ బ్యూటీ సాయి పల్లవి రణబీర్‌కు జోడిగా సీత పాత్రలో కనిపించబోతున్నారన్న న్యూస్ వైరల్ కావటంతో సౌత్ సర్కిల్స్‌లోనూ ఈ సినిమా మీద ఫోకస్ పెరిగింది.

తాజాగా ఈ సినిమాలో గదర్‌ స్టార్‌ సన్నీడియోల్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారన్న న్యూస్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

గదర్ 2 సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన సన్నీ, రామాయణం మూవీ టీమ్‌కు ఓ ఆఫర్ ఇచ్చారన్నది బాలీవుడ్ నయా అప్‌డేట్‌.

ఆయనతో మాస్ యాక్షన్ సినిమా చేస్తే మంచి వసూళ్లు వస్తాయన్న నమ్మకంతో ఆ రేంజ్‌లో పేమెంట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌.

కానీ రామాయణంలో ఛాన్స్ ఇస్తే తక్కువ పేమెంట్‌ మాత్రమే తీసుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారట సన్నీ డియోల్‌.

రామాయణంలో హనుమంతుడి పాత్ర చేసే అవకాశం ఇస్తే 45 కోట్ల రెమ్యూనరేషన్‌ మాత్రమే తీసుకుంటానని నిర్మాతలకు చెప్పారు.

ఈ ఆఫర్ నచ్చటంతో నిర్మాతలు కూడా ఆయన్ను కాస్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.