వరల్డ్ కప్ ఫైనల్ లో స్టార్ హీరోలు.. నాగ చైతన్య ఫన్నీ ఆన్సర్..

19 November 2023

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా వేచి చూస్తుంది.

అయితే ఈ వరల్డ్ కప్ ఫైనల్‌కు సెలబ్రిటీస్ కూడా చాలా మంది వస్తున్నారు. మొన్న సెమీస్‌కు వెంకటేష్ వెళ్లారు.

ఇప్పుడు ఫైనల్‌కు కూడా ఆయనొచ్చేలా ఉన్నారు. వెంకీతో పాటు రజినీకాంత్, రామ్ చరణ్ సైతం ఫైనల్ కోసం రానున్నారని తెలుస్తుంది.

కస్టడీ చిత్రం ప్లాప్ తర్వాత ఒక్క సినిమా కూడా చేయకుండా దూరంగా ఉన్నారు అక్కినేని వారసుడు, యంగ్ హీరో నాగ చైతన్య.

తాజాగా గడ్డంతో కనిపించిన ఆయన.. తన గడ్డం విషయం గురించి మీడియా ఓ ప్రశ్న అడగ్గా ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు.

ఆరు నెల‌లుగా జాబ్ లేదు.. ఇంట్లో ఖాళీగా ఉంటున్నా.. అందుకే జుట్టు, గెడ్డం పెంచుతున్నానంటూ జోక్ చేసారు.

అయితే ఆయన చందూ మొండేటితో చేయబోయే సినిమా కోసమే మేకోవర్ అవుతున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇందులో చైతన్యకి జోడిగా సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనున్నారు.