దర్శకుడిగా కమెడియన్‌ ధన్‌రాజ్.. డబుల్ ఇస్మార్ట్ క్రేజీ అప్‌డేట్..

TV9 Telugu

23 January 2024

తెలుగు సినిమాల్లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధన్‌రాజ్ ప్రస్తుతం దర్శకుడిగా మారారు.

తాజాగా ఈయన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మొదటి సినిమాకు రామం రాఘవం అనే అదిరిపోయే టైటిల్ ఖరారు చేశారు.

జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామం రాఘవం ఫస్ట్ లుక్ 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేసారు.

ఇందులో ధన్‌రాజ్, సముద్రఖని తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తారు.

రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఐదేళ్ళ కింద వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ ఇది.

కథ ఎక్కడ ముగిసిందో.. అక్కడ్నుంచే మొదలవుతుంది. ఈ సినిమాలో డింపుల్ హ‌యాతితో స్పెషల్ సాంగ్ చేయించాల‌ని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

మణి శర్మ ఈ చిత్రానికి స్వరాలూ సమకూరుస్తున్నారు. సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రతినాయకడు పాత్రలో కనిపించనున్నారు.