21 September 2024

నైనికకు సోనియా ముద్దులు.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

బిగ్‌బాస్ హౌస్‌లో సోనియా, నిఖిల్, పృథ్వీ మధ్య ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుందంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ముఖ్యంగా ఈ సీజన్‏లో అత్యధిక నెగిటివిటీ మూటగట్టుకుంది సోనియా ఆకుల. ఇక ఆమె ప్రవర్తన సైతం ప్రేక్షకులకు విసుగు కలిగిస్తోంది. 

నిన్నటి ఎపిసోడ్ లో సోనియా చేసిన పనికి నెటిజన్స్ దారుణంగా తిట్టిపోస్తున్నారు. నైనిక, నిఖిల్, విష్ణు, సోనియా ఒక గదిలో ఉన్నారు. 

ఆ సమయంలో మంచం మీద ఉన్న నైనిక దగ్గరికి నెమ్మదిగా వచ్చింది సోనియా. అసలు ఏం జరుగుతుందో నైనికకు అర్థం కాలేదు. 

కానీ ఆలోపే నైనిక రెండు బుగ్గల మీద రెండు ముద్దులు ఇచ్చింది. నిఖిల్, విష్ణు షాకవ్వగా.. నైనిక షాకై ఆ తర్వాత సిగ్గు పడిపోయింది. 

అయితే సోనియా చేసిన పనికి నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సోనియాను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

గతవారం విష్ణుప్రియ మాట్లాడితే అడల్ట్రీ కామెడీ అంటూ ఏడుస్తూ పెద్ద రచ్చ చేసింది సోనియా. ఇప్పుడు ఆమె చేస్తుందేంటో అంటున్నారు. 

విష్ణు కామెడీగా మాట్లాడితే తెగ రచ్చ చేసిన సోనియా.. ఇప్పుడు నిఖిల్, పృథ్వీలతో కూర్చుని ముచ్చట్లు పెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.