విజయ్‌ సేతుపతి డెసిషన్‌ ది బెస్టే అంటున్న నెటిజన్లు..

04 December 2023

ఇక విలన్‌గా సినిమాలు చేయను అని విజయ్‌ సేతుపతి తీసుకున్న డెసిషన్‌ ది బెస్టే అని అంటున్నారు నెటిజన్లు.

ఈ ఏడాది ఐఎండీబీ మోస్ట్ పాపులర్‌ స్టార్స్ లిస్టులో ప్లేస్‌ పదిలం చేసుకున్నారు సేతుపతి. డంకీ సినిమా ప్రమోషన్లలో షారుఖ్‌ యాక్టివ్‌ కావడంతో ఈ లిస్టు మరోసారి స్క్రీన్‌ మీదకు వచ్చేసింది.

కడుపుబ్బా నవ్వాలనుకున్న ప్రతిసారీ డంకీ సినిమా చూడండి అంటూ ఫ్యాన్స్ ని ఎంకరేజ్‌ చేస్తున్నారు షారుఖ్‌ఖాన్‌.

తన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి సోషల్‌ మీడియా వేదికగా వేదికగా మరింత యాక్టివ్‌ అవుతున్నారు మిస్టర్‌ బాద్షా.

ఆ ల్రెడీ డబుల్‌ ధమాకా అందుకున్న ఈ హీరో ఐఎండీబీ మోస్ట్ పాపులర్‌ స్టార్స్ లిస్టులో ఫస్ట్ ప్లేసుని ఆక్యుపై చేశారు.

మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీలో ఈ టాప్‌ టెన్‌ లిస్టులో షారుఖ్‌, అక్షయ్‌కుమార్‌, విజయ్‌ సేతుపతి... జస్ట్ ఈ ముగ్గురు మగవారి పేర్లే ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ ఏడాది ఓమైగాడ్‌2తో మెప్పించారు అక్షయ్‌కుమార్‌. సౌత్‌లో ఆయన ఇంపాక్ట్ ఈ ఇయర్‌ పెద్దగా లేదు. కానీ, మన దగ్గర నుంచి ఉత్తరాదికి వెళ్లి ఢంకా భజాయించారు సేతుపతి.

నో మోర్‌ విలనిజం అంటూ, ఒన్లీ హీరో కేరక్టర్లకే స్టిక్‌ అవుతున్నారు ఈ హీరో. 2024లో మెర్రీ క్రిస్మస్‌తో ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు సేతుపతి.