31 March 2024
టిల్లు స్క్వేర్ సినిమాతో అనుపమ మాట నిలబెట్టుకుంది..
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ అనుపమ. కానీ కొన్నాళ్లుగా ఈ బ్యూటీపై అభిమానులు కోపంగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇన్నాళ్లు గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాతో రూటు మార్చింది. దీంతో ఫ్యాన్స్ ఆమె గరమయ్యారు.
విడుదలకు ముందే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌లో అనుపమ గ్లామర్ షోతో రెచ్చిపోవడంతో ఓ రేంజ్ లో విమర్శించారు.
కానీ ఈ మూవీలోని లిల్లి పాత్రను వదులుకుంటే తన ఫిల్మ్ కెరీర్లోనే మంచి పాత్రను వదులుకున్నట్లే అంటూ ట్రోలర్స్ కు చెక్ పెట్టింది.
అయినా అనుపమపై విమర్శలు తగ్గలేదు. అంతేకాకుండా నెట్టింట నెగిటివ్ కామెంట్స్ చేయడంతో కొంతవరకు హర్ట్ అయ్యింది అనుపమ.
ఎట్టకేలకు మార్చి 29న టిల్లు స్వ్కేర్ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది. ఫస్ట్ డే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని దూసుకుపోతుంది ఈ మూవీ.
అయితే ఇందులో లిల్లి పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇందులో లిల్లీగా కనిపించిన అనుపమ నటనకు మళ్లీ ఫిదా అయ్యారు ఫ్యాన్స్.
కేవలం గ్లామర్ షో మాత్రమే కాకుండా ఇప్పటివరకు చూడని కొత్త అనుపమ ఈ మూవీలో కనిపించింది. దీంతో ఇప్పుడు ఆమెపై పొగడ్తలు వస్తున్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి.