పెళ్లయిపోయిందోచ్‌.! రకుల్‌ కి మళ్లీ పెళ్లా.? ఇదేం ట్విస్ట్..

Anil Kumar

04 July 2024

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 2024 ఫిబ్రవరిలో బాలీవుడ్ జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.!

తాజాగా ఈ అమ్మడు శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్నా భారతీయుడు 2 సినిమాలో నటించింది. ఈ మూవీ రిలీజ్ కానుంది.

అయితే ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న రకుల్ కి ఒక వింత సంఘటన ఎదురైంది. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఆమె జాకీ భగ్నానీని వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలియక ఓ నెటిజన్.. మీ పెళ్లెప్పుడు.? అని ప్రశ్నించారు.

దీనికి షాక్ అయ్యిన రకుల్‌.. తేరుకొని ఆ నెటిజెన్ కు ఎదురు ప్రశ్నించిన తీరు నెట్టింట వైరల్‌ అవుతోంది..

కొంచెం నవ్వుతూనే ఎన్నిసార్లు పెళ్లి చేసుకోమంటారు అని ఎదురు ప్రశ్నించింది మన బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కొందరు నెటిజెన్ కి కామెడీ గా కామెంట్స్ పెడుతున్నారు.

ప్రస్తుతం ఇండియన్‌2 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు రకుల్‌ ను తన నెక్స్ట్ మూవీపై అప్డేట్ అడుగుతున్నారు.