స్పెషల్‌ జక్కన్న.. మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి. వాట్ ఏ జర్నీ..

Anil Kumar

06 July 2024

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మీద ఓటిటి నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని రూపొందించింది.

వరస విజయాలు.. అన్ని బ్లాక్‌ బస్టర్‌లు., ఇంతటి గుర్తింపు తెచ్చుకోవడానికి ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డారు.?

అంతటి ఘనత కోసం ఎన్నేళ్లు పట్టిందనే కాన్సెప్టుతో మోడ్రన్‌ మాస్టర్స్ ని రూపొందించినట్టు చెప్పారు మేకర్స్.

ఆగస్టు 2 నుంచి ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫారం నెట్‌ఫ్లిక్స్ లో రాజమౌళి డాక్యుమెంటరీ ప్రసారం కానుంది అని టాక్..

ఈ వెబ్ సిరీస్ ను ‘మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి’ అనే పేరుతో రూపొందించినట్టు తెలిపారు సిరీస్ మేకర్స్.

దీనికి సంబంధించిన విషయాన్ని.. సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం.

కాగా ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ డాక్యుమెంటరీలో రాజమౌళి ప్రపంచ సినిమా పై ఏ విధంగా తన ముద్ర వేశారో చూపించనున్నారు.