18 November 2025
గ్లామర్ బ్యూటీ అరాచకం.. స్పెషల్ సాంగ్ చేసిన పట్టించుకోని టాలీవుడ్..
Rajitha Chanti
Pic credit - Instagram
మొదటి సినిమా ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. కొన్నాళ్లకు ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
దీంతో యూత్ ఈ బ్యూటీ పేరు మారుమోగింది. ఒక్కసారిగా కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. కానీ ఈ అందానికి అదృష్టం కలిసి రాలేదు.
తెలుగులో వరుస అవకాశాలు వస్తాయనుకుంటే.. కేవలం ఒకటి రెండు చిత్రాల్లో నటించి సైలెంట్ అయ్యింది. ఇటీవలే ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.
ఆమె మరెవరో కాదు.. నేహా శెట్టి. డీజే టెల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అయ్యింది. ఇందులో రాధిక పాత్రకు ప్రాణం పోసింది నేహా.
ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో కొన్నాళ్లుగా తెలుగులో సరైన ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంది.
అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీలో స్పెషల్ సాంగ్ చేసింది. నిడివి ఎక్కువ కావడంతో సినిమా నుంచి ఆ పాటను తొలగించారు మేకర్స్.
ఆ తర్వాత నేహా శెట్టి స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఆ పాటలో గ్లామర్స్ లుక్స్, ప్రత్యేకమైన స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది నేహా.
అయినప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ ఫోటోలతో సందడి చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్