09 October 2025

సైలెంట్ అయిన రాధిక.. గ్లామర్ బ్యూటీ ఆఫర్స్ కరువే..

Rajitha Chanti

Pic credit - Instagram

తెలుగులో మొన్నటివరకు ట్రెండింగ్ హీరోయిన్. డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రతో భారీగా పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 

నేహా శెట్టి.. కానీ తెలుగు సినీప్రియులకు మాత్రం ఆమె రాధిక. ఈ పాత్రతో ఓవర్ నైట్ స్టార్ గా.. ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

అయితే డీజే టిల్లు తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారంతా.. కానీ అలా జరగలేదు. ఒకటి రెండు చిత్రాల్లో కనిపించింది. 

డీజే టిల్లు తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కనిపించింది. అలాగే టిల్లు స్క్వేర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. 

ప్రస్తుతం ఈ బ్యూటీ సరైన ఆఫర్స్ కోసం చూస్తుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ అమ్మడు. 

కానీ ఈ మూవీలో కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అనే స్పెషల్ పాటలో గ్లామర్ లుక్స్ తో ఇరగదీసింది. కానీ ఈ సాంగ్ థియేటర్లలో సినిమాలో కనిపించలేదు. 

సినిమా నిడివి కారణంగా ఈ పాటను తీసేశారని టాక్. దీంతో అభిమానుల అభ్యర్థన మేరకు ఈ పాటను తిరిగి సినిమాలో చేర్చినా అంతగా రెస్పాన్స్ రాలేదు. 

ప్రస్తుతం నేహా శెట్టి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.