ఒంపుసొంపులతో 'నేహ శెట్టి' అందాలు అదరహో..
19 September 2023
నేహ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'డీజే టిల్లు'తో నటనకు గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నేహ శెట్టి.. ఆ తర్వాత 'గల్లీ బాయ్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
కానీ ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితేనేం సరిగ్గా ఐదేళ్ల తర్వాత డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టింది.
రాధిక పాత్రలో నేహ శెట్టి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ పాత్ర ఆమెకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.
డీజే టిల్లు బ్లాక్‌బస్టర్‌తో నేహ శెట్టికి వరుసగా అవకాశాలు వచ్చాయి. రీసెంట్‌గా 'బెదురులంక 2021' మరో హిట్ దక్కించుకుంది.
నేహ శెట్టి మరో రెండు ప్రాజెక్ట్స్.. ప్రస్తుతం థియేటర్లలో విడుదలకు సిద్దమయ్యాయి. ఇందులో ఒకటి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', రెండు 'రూల్స్ రంజన్'.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే నేహా శెట్టి.. లేటెస్ట్ ఫోటోషూట్స్‌లో తన అందచందాలతో అదరగొడుతోంది.
లేటెస్ట్‌గా ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. న్యూ లుక్ బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి