హిమ శిఖరం కూడా కరిగిపోదా ఈ కోమలి సొగసుకి.. సిజ్లింగ్ నేహా శెట్టి..
01 October 2024
Battula Prudvi
5 డిసెంబర్ 1999న కర్ణాటకలోని మంగళూరులో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ నేహా శెట్టి. పెరిగింది మాత్రం బెంగుళూరులోనే.
‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన నేహ శెట్టి.. ఆ తర్వాత 'గల్లీ బాయ్'తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
కానీ ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. అయితేనేం సరిగ్గా ఐదేళ్ల తర్వాత డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టింది.
రాధిక పాత్రలో నేహ శెట్టి ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ పాత్ర ఆమెకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది.
డీజే టిల్లు బ్లాక్‌బస్టర్‌తో నేహ శెట్టికి వరుసగా అవకాశాలు వచ్చాయి. రీసెంట్‌గా 'బెదురులంక 2021' మరో హిట్ దక్కించుకుంది.
గత ఏడాది కిరణ్ అబ్బవరంకి జోడిగా 'రూల్స్ రంజన్' సినిమాలో కథానాయకిగా నటించింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
ఈ ఏడాది సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్‌లో మరోసారి రాధికగా అదితి పాత్రలో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
తర్వాత విశ్వక్సేన్ సరసన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి