సోయగం హంసకే పోటీ ఈ భామ.. పరువాలు ఒలకబోస్తున్న నేహా..

04 October 2023

6 డిసెంబర్ 1999లో కర్ణాటక మంగళూరులో జన్మించింది 23 ఏళ్ళ అందాల తార నేహా శెట్టి. ఆమె తల్లి డెంటిస్ట్, తండ్రి బిజినెస్ మ్యాన్ ఆమెకు ఒక చెల్లెలు కూడా ఉంది.

మోడలింగ్‌లో తన కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ 2014లో మిస్ మంగళూరు బ్యూటీ పెగెంట్ గెలుచుకుంది, మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది.

2016లో కన్నడలో ముంగారు మేల్ 2 అనే రొమాంటిక్ డ్రామా చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది వయ్యారి భామ నేహా.

2018లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెహబూబా చిత్రంలో ఆకాష్ పూరికి జోడిగా నటించింది ఈ బ్యూటీ. ఈ చిత్రం వీక్షకులను నిరాశపరిచింది.

దీని తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన గల్లీ రౌడీ చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. ఈ చిత్రం కూడా ప్లాప్ అయింది.

దీని తర్వాత డీజే టిల్లు చిత్రంలో సిద్దు జొన్నలగడ్డతో రొమాన్స్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవల ఈమె నటించిన బెదురులంక 2012కి పాజిటివ్ టాక్ వచ్చింది.

కిరణ్ అబ్బవరంకి జోడిగా నటించిన రూల్స్ రంజాన్ ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో నటిస్తోంది.