చల్లని చంద్రునికి సెగలు పుట్టవా.. ఈ వయ్యారి సొగసును చూసి..
TV9 Telugu
27 March 2024
6 డిసెంబర్ 1999న కర్ణాటకలోని మంగళూరులో బంట్ జాతికి చెందిన కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ నేహా శెట్టి.
ఈ ముద్దుగుమ్మ కుటుంబం తుళు భాషకి చెందినవారు. ఈ బ్యూటీ పుట్టింది మంగళూరులో అయినప్పటికీ పెరిగింది అంతా బెంగళూరులోనే.
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలో సోఫియా హై స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ అందాల భామ.
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలోని ఓ ప్రముఖ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది ఈ వయ్యారి భామ.
2016లో కన్నడ రొమాంటిక్ డ్రామా చిత్రం ముంగారు మలే 2తో చలనచిత్ర అరంగేట్రం చేసింది అందాల తార నేహా శెట్టి.
2018లో ఆకాష్ పూరికి జోడిగా మెహబూబాతో తెలుగుతెరకు పరిచయం అయింది. తర్వాత గల్లీ రౌడీ చిత్రంలో సందీప్ కిషన్ సరసన నటించింది.
2022లో సిద్దు జొన్నలగడ్డకి జోడిగా నటించిన DJ టిల్లు చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
2023లో బెదురులంక 2012 చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి