15 February 2024

అందాలతో మ్యాజిక్ చేస్తున్న నేహా శెట్టి

TV9 Telugu

 నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు. మెహబూబా' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

నేహా శెట్టి 'ముంగారు మగ 2' అనే కన్నడ సినిమాతో సినీరంగం లోకి అడుగుపెట్టింది. తనదైన శైలి నటనతో అందరిని ఆకట్టుకుంది.

‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘డీజే టిల్లు’, ‘బెదురులంక 2012’ వంటి చిత్రాలతో అలరించింది.

కానీ  సిద్ధూ జొన్నలడ్డ సరసన నటించి DJ Tillu సినిమాతో  తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది.

డీజే టిల్లు లో రాధిక పాత్రలో పోషించి తన అంద చందాలతో.. తన నటనతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది నేహా శెట్టి.

ఓవైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ అందరిని కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులతో.. బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో.. మరోవైపు గ్లామర్ తో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తోంది నేహా శెట్టి.

అయితే  ప్రస్తుతం  ఈ బ్యూటీ విశ్వక్ సేన్ సరసన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీలో నటిస్తోంది.   తాజాగా షేర్ చేసిన నేహా శెట్టి ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.