20 October 2024

అరె.. ఏంట్రా ఈ అరాచకం.. నెట్టింట అందాల గత్తరలేపుతోన్న రాధిక.. 

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహాశెట్టి తన క్యూట్ లుక్స్‏తో కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తోంది. కిల్లింగ్ చూపులతో మతిపోగొట్టేస్తోంది. 

రెడ్ టీషర్ట్ జీన్స్‏లో మత్తెక్కించే చూపులతో నెట్టింట మాయ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా నేహా శెట్టి లేటేస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లను చిత్తు చేస్తుందని.. నెట్టింట రచ్చ చేస్తుందని అంటున్నారు. 

డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యింది నేహాశెట్టి. ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ డమ్ అందుకుంది. 

ఈ సినిమాలో రాధిక పాత్రలో గ్లామర్ ట్రీట్ ఇచ్చేసింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగు సినీరంగంలో వరుస ఆఫర్స్ క్యూ కట్టిన సంగతి తెలిసిందే. 

ఇటీవలే విశ్వక్ సేన్ సరసన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో అలరించింది. కానీ ఆ తర్వాత సినిమాల్లో అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు.

ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో తెగ హడావిడి చేస్తోంది నేహా. ఈ బ్యూటీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. 

2014లో మిస్ మంగళూరు అందాల పోటీతో గెలిచింది. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది. మెహబూబ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.