11 December 2023

నెట్టింట వైరల్ అవుతున్న నేహాశెట్టి బర్త్ డే ఫొటోస్

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ నేహాశెట్టి‏కి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అభిమానులు ఆమె రాధిక అంటూ పిలుచుకుంటుంటారు.

గ్లామర్ రోల్ మాత్రమే కాకుండా కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. తెలుగులో బిజీ అయిపోయింది.

ఇక ఈక్రమంలోనే రెండు మూడు రోజుల క్రితం.. తన బర్త్‌ డే సెలబ్రేషన్స్ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ బ్యూటీ.

2016లోనే కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నేహా ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అయితే ఈ సినిమాతో అంతగా గుర్తింపు రాలేదు కానీ.. ఆ తర్వాత వచ్చి డీజే టిల్లు మాత్రం ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మార్చేసింది.

ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీ సెలబ్రెటీస్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక నేహా తన బర్త్ డే సెలబ్రెషన్స్ ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అందులో ఆమె తల్లిదండ్రులు, చెల్లి కనిపిస్తున్నారు.