బాలయ్యకు జోడీగా ఆ స్టార్ హీరోయిన్.. ఉమాపతి అప్‌డేట్..

19 December 2023

TV9 Telugu

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి.

తాజాగా ఈ చిత్రం గురించి మరో వార్త వినిపిస్తుంది. ఇందులో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని.. అందులో బాలయ్యకు జోడీగా త్రిష నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా త్రిష కాదు.. ప్రియమణి ఇందులో నటించబోతున్నారనే మరో వార్త కూడా వైరల్ అవుతుంది. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

చిన్నారి పెళ్లికూతురుతో గుర్తింపు తెచ్చుకున్న నటి అవికా గోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఉమాపతి. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది.

డిసెంబర్ 29న విడుదల కానుంది అవికా ఉమాపతి సినిమా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

సత్య ద్వారంపూడి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

చైతన్యరావు, హెబ్బాపటేల్‌ జంటగా బాలరాజశేఖరుని తెరకెక్కిస్తున్న సినిమా ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. ఈ చిత్రం తొలి పోస్టర్‌ని నాగార్జున విడుదల చేశారు.

దర్శకుడు బాల అన్నపూర్ణ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి డీన్‌ అని.. మా విద్యార్థులకు, అధ్యాపకులకూ ‘హానీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌' చిత్రంలో అవకాశాలు ఇచ్చాడంటూ చెప్పుకొచ్చారు నాగార్జున.