బాలయ్య, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఫైట్ సీక్వెన్స్‌తోనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్లు ఈ సినిమా కథను సిద్ధం చేసారు బాబీ. మార్చ్ 29, 2024న ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి.
న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో కన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతోంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుంది.
అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి చిత్రాలను ఇక్కడే షూట్ చేశారు.
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన కొత్త సినిమా ‘దీపావళి’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న ఈ సినిమా విడుదలవుతోంది.
దాదాపు 45 రోజుల ఫారెన్ ట్రిప్ తర్వాత ఇండియాకు వచ్చారు ప్రభాస్. వచ్చీ రాగానే ఆయన వరసగా సినిమా షూటింగ్స్‌తో బిజీ అవ్వాలని చూస్తున్నారు.
ప్రస్తుతం సలార్‌తో పాటు మారుతి, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ముందు సలార్ ప్రమోషన్స్ చేసిన తర్వాత.. మిగిలిన సినిమాలకు టైమ్ ఇవ్వనున్నారు ప్రభాస్.
కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా ఇండియన్ 2 విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ 2తో పాటు పార్ట్ 3 కూడా ఉంటుందని తెలిపారు శంకర్.