అక్కడా అదృష్టాన్ని చెక్ చేసుకోనున్న నయన్.. !

14 September 2023

లేడీ సూపర్ స్టార్ నయనతార స్టైలే వేరు.. ఆమె ఏమి చేసినా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ

జవాన్ మూవీ సక్సెస్‌ను ఆశ్వాదిస్తున్న నయనతారు.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి ఆమె వ్యాపార రంగంలో అడుగుపెడుతున్నారు.

స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ బిజినెస్ మొదలుపెట్టినట్లు స్వయంగా విఘ్నేశ్ శివన్‌ సోషల్ మీడియాలో వెల్లడించారు.

సెల్ఫ్ లవ్ చాలా ముఖ్యమని ఇద్దరూ నమ్మామని.. అందుకే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ బిజినెస్ మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు.

సెప్టెంబర్ 29 నుంచి వ్యాపారవేత్తలుగా ఇద్దరూ కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతున్నట్లు విఘ్నేశ్ తెలిపారు. ఆ రోజు నుంచి తమ అఫిషియల్ సైట్‌లో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్‌ని కొనుగోలు చేయొచ్చని వెల్లడించారు.

ఈ బిజినెస్‌కి సంబంధించి ఆరేళ్లుగా వర్కౌట్ చేస్తున్నట్లు నయన్ భర్త విఘ్నేశ్ వెల్లడించారు. ఈ గుడ్ న్యూస్‌ని ఫ్యాన్స్‌తో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఓ వైపు వెండితెరపై వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. నయనతార ఇప్పుడు వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టడం పట్ల ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తంచేస్తున్నారు.

వ్యాపార రంగంలోనూ నయనతార తప్పనసరిగా సక్సస్ సాధిస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.