25 November 2023

నటనకు గుడ్ బై చెప్పేస్తోన్న నయన్ ?.. ఇన్ స్టా పోస్ట్ వైరల్.. 

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‏గా తనకంటూ ఓ ఫాలోయింగ్ సంపాదించుకుంది హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో నయనతార ఒకరు.

 ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. షారుఖ్, అట్లీ కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామి సృష్టించిన సంగతి తెలిసిందే. 

దాదాపు రెండు దశాబ్దాలుగా విభిన్న పాత్రలు పోషిస్తూ నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో నయనతారకు ఆఫర్స్ క్యూ కట్టినట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా పోస్ట్ తో అభిమానులకు షాకిచ్చింది నయన్. కొత్త ప్రారంభాల మ్యాజిక్‏ను నమ్మండి అంటూ కొత్త ఫోటోను షేర్ చేసింది నయనతార. 

దీంతో నయనతార నటనకు గుడ్ బై చెప్పేసి.. దర్శకత్వం వైపు అడుగులు వేస్తుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు నెట్టింట ఇదే హాట్ టాపిక్. 

ఇక రాబోయే రోజుల్లో నయనతార దర్శకురాలిగా మారబోతుందని.. అందుకే కెరీర్లో కొత్త అధ్యాయమంటూ పోస్ట్ చేసిందని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం నయనతార తన రాబోయే 75వ సినిమా అన్నపూర్ణి..ది గాడెస్ ఆఫ్ ఫుడ్ చిత్రంలో నటిస్తుంది.  కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్  శరవేగంగా జరుగుతుంది. 

అంతేకాకుండా అటు బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నయన్ కొత్త సినిమా చేయబోతుందని టాక్ నడుస్తోంది. దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు.