16 ఏళ్ల తర్వాత ప్రభాస్ సరసన నయనతార.. ఏ సినిమాలో అంటే.. 

23 September 2023

Pic credit - Instagram

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. 

ఇప్పుడు ఈ బ్యూటీ ప్రభాస్ సరసన నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ సూపర్ హిట్ కాంబో రిపిట్ కాబోతుంది. 

 2007లో యోగి సినిమాలు వీరిద్దరు కలిసి నటించారు. అప్పట్లో వీరిద్దరి జోడిగా మంచి ఫాలోయింగ్ ఉండేది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లూ రాబట్టింది. 

ఇక ఇప్పుడు ఈ మరోసారి ఈ జోడి వెండితెరపై సందడి చేయబోతుంది.  అదే మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో కనిపించనున్నారు. 

పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు నటించనున్నారు. 

ఈ సినిమాను మంచు మోహన్ బాబు.. ఆయన తనయుడు మంచు విష్ణు కలిసి నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో నటించనున్నారు. 

ఇక ఇప్పుడు ఇందులో నయనతార సైతం నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే  దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన రాలేదు. 

ఇందులో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనుండగా.. ఆయనకు జోడిగా నయనతార పార్వతి పాత్రలో నటించనున్నట్లు బయట టాక్ నడుస్తోంది.