నయనతార గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సంచలన విజయాన్ని సాధించింది. అయితే బాలీవుడ్‌లో మరో అవకాశం రాలేదు.
ఇక తమిళంలో ఇటీవల నయనతార నటించిన ఇరైవన్, అన్నపూరణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయనే చెప్పాలి.
మన్నాగట్టి, సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, మాధవన్‌తో కలిసి టెస్ట్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. వీటిలో ఏదో ఒకటి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిఇలా ఉంటే కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు నయన్‌కు దూరమవుతూ నటి త్రిష వైపు వెళుతున్నాయని చెప్పక తప్పడం లేదు.
తన మాతృభాష అయిన ఈ చిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకుముందే మమ్ముట్టి, నివిన్‌బాలీ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు
అయితే నయనతార మలయాళంలో నటించిన చివరి చిత్రం గోల్డ్ కాగా ఈ చిత్రం 2022లో విడుదలై పెద్దగా ఆడలేదు.
దీంతో కొంతకాలం మాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార.. తాజాగా డియర్ స్టూడెంట్ నటించడానికి సిద్ధం అవుతున్నారు