ఆ స్టార్ హీరో సినిమాలో నటించి పెద్ద తప్పు చేశాను: నయన తార

TV9 Telugu

20 June 2024

నయనతార ఇప్పుడు ఇండియాలోనే ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. జవాన్ సినిమా తర్వాత హిందీలోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే కెరీర ప్రారంభంలో నయనతార చేసిన సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. తాజాగా వీటిపై స్పందించింది నయన్.

 ముఖ్యంగా సూర్య, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా గజనీపై సంచలన కామెంట్లు చేసిందీ లేడీ సూపర్ స్టార్.

ఇందులో అసిన్‌ ప్రధాన కథానాయికగా నటించగా లేడీ సూపర స్టార్  నయనతార మాత్రం ఒక కీలకపాత్రలో కనిపించింది.

ఈ సినిమా గురించి నయనతార గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీన్ని అంగీకరించడం తన జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయమంది.

గజిని’లో నా రోల్ ను  కథ వివరించేటప్పుడు చెప్పిన విధంగా తెరకెక్కించలేదు. ఫొటోలను కూడా భిన్నంగా చూపించారు'

అందుకే ఈ సినిమా ఓకే చేయడం నేను తీసుకున్న చెత్తనిర్ణయమని అంగీకరిస్తాను. అయితే ఇందులో ఎవరినీ నిందించను' అని తెలిపింది నయన తార.

'ఇలాంటి వాటిని గుణపాఠంగా స్వీకరించి కెరీర్ లో ముందుకు సాగుతున్నాను' అని సంచలన కామెంట్స్ చేసింది నయన తార.