విఘ్నేశ్‌తో ఉన్న ఫొటోలు షేర్ చేయను.. కారణమిదే: నయనతార

14 December 2024

Basha Shek

సినిమా ఇండస్ట్రీలో అందమైన జోడీల్లో సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార నయనతార- డైరెక్టర్ విఘ్నేశ్‌ శివన్‌ల జంట  ఒకటి

ఏడేళ్లు ప్రేమలో మునిగితేలిన వీరు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో  2022 జూన్‌ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

వీళ్లకు ఉయిర్‌, ఉలగమ్‌ అనే ట్విన్స్‌ ఉన్నారు. వీర ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది నయన తార.

 అయితే కొన్ని రోజులుగా విఘ్నేశ్‌తో దిగిన ఫొటోలను నయనతార సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం బాగా తగ్గించేసింది.

తాజాగా నయన్‌ దీనికి కారణాన్ని వివరించింది. సోషల్‌ మీడియాలో వచ్చే నెగెటివ్‌ కామెంట్స్‌ వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.

 'బ్యాడ్‌ కామెంట్స్‌ కారణంగానే నేను విఘ్నేశ్‌ శివన్ గురించి ఓపెన్‌గా పూర్తిగా చెప్పలేని స్థితికి చేరుకున్నాను'

'అందుకే తను నాతో ఉన్న ఫొటోలు పోస్ట్‌ చేయడం దాదాపు మానేశాను' అని చెప్పుకొచ్చిందీ సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్

'షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు తనని నిజంగా మిస్‌ అవుతాను. ఆ సమయంలో మాత్రమే ఫొటోలు షేర్‌ చేస్తున్నా' అని నయన్ తెలిపింది.