22 November 2025

నయనతార రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే.. అన్నీ స్టార్ హీరోల చిత్రాలే..

Rajitha Chanti

Pic credit - Instagram

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో దక్షిణాదిలో తనదైన ముద్ర వేసింది.

ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. కానీ మీకు తెలుసా.. ? కెరీర్ పీక్స్ లో ఉండగానే నయనతార అనేక హిట్ చిత్రాలను వదులుకుంది. ఇంతకీ అవెంటంటే.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా గురించి తెలిసిందే. ఈ మూవీకి ముందుగా నయనతారను ఎంపిక చేయగా ఆమె సున్నితంగా నో చెప్పిందట.

అలాగే కార్తి, తమన్నా జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ఆవారా సినిమాకు సైతం ముందుగా నయనతారను అనుకున్నారు. కానీ ఆమె కండీషన్స్ పెట్టడంతో ఛాన్స్ మిస్సైంది.

తమిళంలో ఉదయనిధి స్టాలిన్, హాన్సిక నటించిన ఓకేఓకే సినిమాకు సైతం నయనతార ఫస్ట్ ఛాయిస్. కానీ అప్పటికే ఆమె బిజీగా ఉండడంతో సినిమాను వదులుకుంది.

ఇక సూర్య నటించిన సింగం 2 చిత్రంలో వాలే వాలే పాట కోసం చిత్రయూనిట్ ముందుగా నయన్ ను సంప్రదించిందట. కానీ ఆమె రిజెక్ట్ చేసిందని టాక్.

శరవణ స్టోర్స్ యజమాని లెజెండ్ శరవణన్ నటించిన ది లెజెండ్ సినిమాకు ఆమెను సంప్రదించగా.. 100 కోట్లు ఇచ్చినా నటించనని చెప్పిందని ఇండస్ట్రీలో టాక్.

షారుఖ్ ఖాన్, దీపిక జంటగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాకు ముందుగా నయనతారను ఎంపిక చేశారు. కానీ ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉందట.