11 october 2023

బంపర్ ఆఫర్ కొట్టేసిన నయన్.. ఈ సారి లెక్క వేరే

రీసెంట్గా 'జవాన్‌'తో.. సూపర్ డూపర్ హిట్టు కొట్టిన నయనతార మరో బంపర్ ఆఫర్ పట్టేశారు.

నయనతార ఈ సారి ఏకంగా బాలీవుడ్ స్టార్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కళ్లలో పడ్డారు. 

సంజయ్‌ లీలా బన్సాలీ.. రణ్‌ వీర్ సింగ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో భాగం కానున్నారు.

సంజయ్‌ లీలా బన్సాలీ.. ప్రెస్టీజియస్‌గా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'బైజు బావ్రా' సినిమాలో నయన్ నటిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లోకి త్వరలో అడుగుపెట్టబోతున్నారు నయన్.

ఇక ఈ సినిమాలో రణ్‌ వీర్‌కు జోడీగా.. హీరోయిన్‌గా ఇప్పటికే ఆలియా భట్ నటిస్తున్నారు. 

ఆలియాకు తోడు.. నయన్ కూడా వచ్చి చేరడంతో.. ఈసినిమా వైపే ఇంట్రెస్టింగ్‌ గా చూస్తున్నారు నయన్ ఫ్యాన్స్..