కొన్నిరోజులుగా లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేశ్ శివన్ జంట వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.
కానీ ఇటీవల తన ఇన్ స్టాలో నయన్ హార్ట్ బ్రేకింగ్ కోట్స్ పెట్టడంతో ఆమె తన భర్తతో విడిపోతుందని వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ రూమర్స్ పై వీరిద్దరూ స్పందించలేదు.
ఆమెకు ఇది లభించిందని కన్నీళ్లతో చెబుతుంది.. అలాగే ఆమె కోల్పోయింది అంటూ ఎమోషనల్ కోట్స్ షేర్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్.
కానీ ఈ రూమర్స్‌తో సంబంధం లేకుండా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది నయన్. అటు వీరిద్దరు ఒకరి గురించి ఒకరు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
దీంతో వీరిద్దరు విడాకుల వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే అని.. నిజానికి ఈ జంట ఎంతో అన్యోన్యంగా సరదాగా గడుపుతుందని వీరి సన్నిహితులు చెబుతున్నారు.
నయన్ హార్ట్ బ్రేకింగ్ కోట్స్ కేవలం పబ్లిసిటి స్టంట్ మాత్రమే అని.. కావాలనే నయన్ ఎమోషనల్ మెసేజేస్ షేర్ చేస్తుందంటూ నెటినజ్స్ ఆమె తీరుపై మండిపడ్డారు.
అయితే నయన్ తన భర్తతో విడిపోవడానికి అసలు తావు లేదంటున్నారు. నయన్ అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సలహాలు ఇచ్చింది విఘ్నేశ్ శివన్ అని సమాచారం.
అంతేకాకుండా నయనతార చేస్తోన్న అనేక వ్యాపారాలకు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఫౌండర్ గానో.. కో ఫౌండర్ గానో ఉన్నారని.. అందుకే వీరిద్దరు విడిపోయే ఛాన్స్ లేదంటున్నారు.