ఆయిల్ సంస్థలో రూ.100 కోట్లు పెట్టుబడి.. బిజినెస్లో ఈ హీరోయిన్ సత్తా
Rajitha Chanti
Pic credit - Instagram
సాధారణంగా సోషల్ మీడియాలో సినీతారల జీవితాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. వారి పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం విభిన్నం. సౌత్ ఇండస్ట్రీలో సొంతంగా ప్రైవేట్ జెట్ ఉన్న ఏకైక హీరోయిన్ ఆమె. ఇంతకీ ఎవరంటే..
తనే లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఆస్తులు, లైఫ్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఎందుకో తెలుసుకుందామా.
నయన్ తన ఫ్యామిలీతో కలిసి చెన్నైలోని పోయెస్ గార్డెన్లో నివసిస్తుంది. రజినీకాంత్, మాజీ పెప్సీ సీఈఓ ఇంద్రా నూయి వంటి సంపన్నులు నివసించే ప్రాంతం.
16,500 చదరపు అడుగుల నాలుగు బెడ్ రూమ్స్ ఉన్న ఈ ఇంటిని 2021లో కొనుగోలు చేసింది. ఇందులో బాత్రూమ్స్ దాదాపు 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి.
అలాగే ఈ ఇంట్లోనే సొంతంగా స్పా.. హోమ్ థియేటర్, ప్రైవేట్ జిమ్, స్విమ్మింగ్ ఫూల్, చుట్టూ గాజు ప్యానెల్స్.. వివిధ లగ్జరీలతో ఎంతో అందంగా ఉంటుంది.
సినిమాలే కాకుండా బిజినెస్ రంగంలోనూ రాణిస్తుంది. ఆమె డాక్టర్ రెనిటా రాజన్ తో కలిసి ది లిప్ బామ్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఇది ఇప్పుడు 100కి పైగా ఉత్పత్తులను క్రియేట్ చేస్తుంది.
UAEలోని చమురు పరిశ్రమలో దాదాపు రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టిందని టాక్. రియల్ ఎస్టేట్ సంస్థలలో పెట్టుబడులు పెట్టింది. రూ.50 కోట్లు విలువైన ప్రైవేట్ జెట్ ఉంది.