నయనతార అరుదైన ఘనత.. షారుక్‌ను సైతం వెనక్కు నెట్టి..

14 September 2023

జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌లోకి బ్లాక్‌ బస్టర్‌ ఎంట్రీ ఇచ్చింది సౌతిండియన్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రికార్డులు కొల్లగొడుతోంది

హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళ్‌, మలయాళ భాషల్లోనూ జవాన్‌ సినిమాకు  వసూళ్ల వర్షం కురుస్తోంది

కాగా ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నయనతార టాప్‌ ప్లేస్‌లో నిలిచింది

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ నెట్టింట అత్యధికంగా శోధించిన, ట్రెండింగ్ సినిమాలను గుర్తించడం ద్వారా ఈ రేటింగ్ ఇస్తుంది

ఈ వారం రిలీజైన జాబితాలో నయనతార అగ్రస్థానంలో ఉంటే, రెండో స్థానంలో షారుక్‌ఖాన్‌ కొనసాగుతున్నారు.