దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార జవాన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో షారుఖ్ ఖాన్ హీరోగా నటించాడు.
గతేడాది రిలీజైన జవాన్ చిత్రం బాక్సాఫీస్ రికార్డులలను బద్దలు కొట్టేసింది. ఇందులో హీరోయిన్ గా నయన తారకు మంచి మార్కులే పడ్డాయి.
వాన్ తర్వాత మరో రెండు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోందీ లేడీ సూపర్ స్టార్. ఇందులో మన్నాంగట్టి సిన్స్ 1960 లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం గమనార్హం.
అలాగే క్రికెట్ నేపథ్యంలో టెస్ట్ అనే మరో సినిమాలో నటిస్తోంది నయనతార. ఇందులో విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా నటిస్తున్నారు.
ఈ రెండు సినిమాల షూటింగ్ లు దాదాపు పూర్తి కావొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.
జవాన్ చిత్రంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొట్టిన లేడీ సూపర్ స్టార్ కు అక్కడ మరో క్రేజీ ఆఫర్ వరించినట్లు తాజా సమాచారం.
సూపర్ హిట్స్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నయన్ నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్.
త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. దీంతో పాటు నయన్ కొత్త సినిమాలపై త్వరలోనే అప్ డేట్స్ రానున్నాయి.